మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు కన్నుమూత

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం కన్నుముశారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామచంద్రరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకరవ్గం నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయంలో చిన్నతరహా పరిశ్రమలు, విద్యుత్‌ శాఖల మంత్రిగా కలిదండి పనిచేశారు.