మాజీ మంత్రి సత్‌ మహాజన్‌ గుండెపోటుతో మృతి

న్యూడిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సత్‌ మహాజన్‌ (85) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయనకు డిల్లీలోని ఎస్కార్ట్స్‌ ఆసుపత్రిలో బెలూన్‌ ద్వారా చేసే గుండె చికిత్స నిర్వహించారు. శుక్రవారం సాయంత్రమే ఆయన్ను డిశ్ఛార్జి చేశారు. వీరభద్ర సింగ్‌ మంత్రివర్గంలో రెవెన్యూ, రవాణా, గ్రామీణాభివృద్ది మంత్రిగా కొనసాగిన మహాజన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ గ్రామీణాబివృద్దికి ఎంతో తోడ్పడ్డారు. కాంగ్రా ప్రాంతంలో ఆయన్ను అందరూ ‘ఫీల్డ్‌ మార్షల్‌’ అని పిలుస్తుంటారు.