మాజీ మావోయిస్టు కుటుంబ సభ్యులను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన మాజీ మావోయిస్టు సాంబశివుడు కుటుంబ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ను కలిసి ఆసరా, ఆహారభద్రతా కార్డులు ఇచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.