మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) :
మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు మోటూరి రవి మట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్న పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ భారీ ఓట్ల మెజార్టీతో గెలి పించిరాష్ట్రంను సాధించుకోవాలని, ఎన్ని సీమాంధ్ర పార్టీలు వచ్చినా తెలంగాణను అడ్డుకోలేరన్నారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరుకృషి చేయాన్నారు. ఈకార్యక్రమంలో బండారి మంజుల, చిప్ప సుధాకర్‌, రాజన్న నాయక్‌, కుమారస్వామి, నర్సింగరావు, మల్లయ్య,బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.