మార్చ్‌కు కదన కుతూహలం

లక్షలాది మందితో హైదరాబాద్‌ ముుట్టడిస్తాం
అడ్డంకులెన్నైనా మార్చ్‌ను విజయవంతం చేస్తాం
శ్రీధర్‌బాబు నోరు విప్పకపోతే… పదవులే కాదు ఇంకేమైనా పోవచ్చు
ఘాటుగా హెచ్చరించిన కోదండరాం
కరీంనగర్‌, సెప్టంబర్‌ 16 (జనంసాక్షి):
ఈ నెల 30న హైదారాబాద్‌ల నిర్వహించనున్నా తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన మార్చ్‌ను విజయవంతం చేసి కేంద్రాన్ని కల్లుతెరిసిస్తామని తెలంగాణ జెయింట్‌ యాక్షన్‌ కమిటి చైర్మెన్‌ ప్రోఫెసర్‌ కోందండరాం స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన కవాతుకు ఆయాన ముఖ్య అతిదిగా వచ్చారు. జిల్లా కేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయాన మాట్లాడారు. ఈ కవాతు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వ హించి మార్చ్‌ 30న లక్షలాది మందితో హైదారాబాద్‌ను ముట్టడిస్తామని అన్నారు. తెలంగాణ కోసం అన్ని రంగాల ఉద్యమాలు చేసిన కేంద్రభ్రత్వం వాయిదాలు వేస్తూ తెలంగాణపై నాన్చుడు దోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని ఆటంకాలు
సృష్టిస్తే జరిగే పరిణామాలకు తెలంగాణ నేతలదే భాద్యత అని హెచ్చరించారు. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికైన తెలంగానపై స్పందిచకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.తెలంగాణ ఇవ్వకపోతే ఏమైతది కాకుంటే అధికారం పోతది అంతకు మించి ఏమైతదని ప్రశ్నిస్తున్న మంత్రి శ్రీధర్‌ బాబు తన తండ్రి(శ్రీపాదరావు)కి ఏగతి పట్టిందో ఇక సారి గుర్తు చేసుకుంటే మంచిదని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌ ఆంధ్ర వలస వాద పెత్తం దారులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నదే తప్ప బతుకు దెరువుకోసం వచ్చిన వారిపై కాదన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేవి సీమాంధ్రనేతలు లగడపాటి, రాయపాటి, కావురిలు తప్ప తెలంగాణ కోసం ప్రజా స్వామ్యయుతంగా ఉద్యమిస్తున్నా వారు కాదని అన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతంలోని రైతులు యురియా, కరెంట్‌, ధరల పెరుగుదలలతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతం ప్రజలకు న్యాయం జరుగుతుందని సమ్మే ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రకటించేవరకు పోరాటం కొస సాగిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యోగసంఘం చైర్మెన్‌ దేవిప్రసాద్‌ మట్లాడుతూ…తెలంగాణ ఉద్యోగులు ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించి ఉద్యమాలు పాల్గోంటున్నామని మార్ఛ్‌ విజయవంతానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాద్యాయ కార్మికులు అధిక సంఖ్యలో మార్చ్‌కు తరటి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. తమతోపాటు కుటుంబ సభ్యులను తీసువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను చెప్పాలన్నారు. జిల్లానుండి వచ్చే వారికి హైదారాబాద్‌లో ఆతిధ్యం ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నమని తెలిపారు. విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ మా పార్టీతరుపున తెలంగాణ వచ్చేవరకు కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో టిఎన్‌సీవో అధ్యక్షుడు స్వామిగౌడ్‌, ఉద్యోగుల సంఘనేతలు శ్రీనివాస్‌ గౌడ్‌, విఠల్‌ తదితర తెలంగాణ సంఘ నాయకులు పాల్గోన్నారు.