మార్చ్‌పై పోలీసుల హింసపై తెలంగాణ జేఏసీ మౌన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై పోలీసులు జరిపిన దమనకాండకు నిరసగా ఉదయం లంగర్‌హౌస్‌ బాపుఘాట్‌ వద్ద తెలంగాణ జేఏసీ మౌన దీక్ష చేపట్టనుంది. తెలంగాణ మార్చ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్లే ఇచ్చి మరోవైపు కుట్ర పూరితంగా వ్యవహరించి ప్రజలపై లాఠీ ఛార్జ్‌ చేశారని  తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. అంతేకాకుండా టీజేఏసీ నాయకత్వంపై పోలీసులు అక్రమ కేసులు  బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. గాంధీజీ మార్గంలో తెలంగాణ ప్రజలు తమ అకాంక్షలను వ్యక్తం చేస్తే ప్రభుత్వం తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.