మావోయిస్టుపార్టీ నేతల అరెస్టు ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

ఖానాపురం, జూన్‌ 10(జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యురాలు కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్కతో పాటు మరో ఆరుగురు మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసి జిల్లా కోర్టుకు తరలించినట్లు గూడూరు సిఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. ఈసంఘటన కు సంబందించి సిఐ రాజ శేఖర్‌రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర కాల ఉపఎన్నికల సందర్భం గా ఏర్పాటు చేసిన అంచలంచెల తనిఖీల లో భాగంగా వాహనాలను తనికీ చేస్తుం డగా శనివారం ఉదయం ఏపి 12సి 4374 మెరూన్‌ కలర్‌ క్వాలీస్‌ పోలీసుల తనికీలను తప్పించుకొని ముం దుకు పోగా ఖానాపూర్‌ శివారులో పోలీసులు అప్రమత్తమై ఆవాహనాన్ని పట్టుకొని తనికీ చేశారు. అందులో 4 గురు మహిళలు, ముగ్గురు పురుషులు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. తదుపరి వారిని విచారించగా వారు మావోయిస్టు మహిళా కేంద్ర కమిటి సభ్యురాలు కేంద్ర కమిటి సభ్యుడు దివంగత ఆజాద్‌ భార్య కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్క, ఆత్మకూర్‌ అన్నపూర్ణ ఆలియాస్‌ సౌమ్య, ఆత్మకూర్‌ సునీల్‌కుమార్‌ ఆలియాస్‌ శ్యాం, ఆత్మకూర్‌ రమణయ్య ఆలియాస్‌ సుభ్రమణ్యం, ఆత్మకూర్‌ బుజ్జమ్మ ఆలియాస్‌ రాజేశ్వరి, అమరవీరుల బందుమిత్రుల కమిటి సభ్యురాలు, ఆర్‌కే భార్య సింగ్‌ చంద్రకళ ఆలియాస్‌ భారతక్క , కేకేడబ్ల్యూ సుధాకర్‌ కొరియర్‌ చింతం కిరణ్‌ ఆలియాస్‌ ఉప్పలయ్యలుగా గుర్తించినట్లు సిఐ తెలిపారు. వీరు వైజాక్‌ నుండి వరంగల్‌ మీదుగా భద్రాచలం ద్వారా ఛత్తీస్‌గడ్‌ వెళ్లాలని నిచ్చయించుకున్నట్లు తెలిపారు. వీరి వద్దనుండి కొన్ని కీలక పత్రాలు, రెండు జతన షూ, చెప్పులు, రెండు జతల ఆలీవ్‌గ్రీన్‌ దుస్తులు, ఆరువేల విలువైన మందులు, లగేజీ బ్యాగులు, 45వేల రూపాయల నగదు స్వాదీన పర్చుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మావోయిస్టుల నినాదాలు ఖానాపురం మండల పరిధిలో శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితులను మావోయిస్టులుగా గుర్తించి ఆదివారం ఉదయం వారిని జిల్లా కోర్టుకు తరలిస్తుండగా వారు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలోనే అమరవీరులకు జోహర్లు, కామ్రెడ్‌ ఆప్పారావు, ఆజాద్‌లకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. కేంద్రకమిటి సభ్యురాలి అరెస్టుతో ఉలిక్కిపడ్డ ఓరుగల్లు మావోయిస్టు కేంద్ర కమిటి కార్యదర్శి ఆజాద్‌ భార్య మహిళా కేంద్ర కమిటి సభ్యురాలు కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్కతో పాటు మరో ఆరుగురు నల్లమల దండకారుణ్య ఏరియా దళసభ్యులు అరెస్టు కావడంతో ఓరుగల్లు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఉప ఎన్నికల సందర్భంగా భారీ బందోభస్తు ఉన్నప్పటికి మావోయిస్టుల కదలికలను పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత కొంత కాలంగా మావోయిస్టు కార్యక్రమాలు స్థబ్దుగా ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. పరకాల ఉప ఎన్నికల సందర్భంగా వాహనాల తనికీలో భాగంగా మావోయిస్టుల కేంద్ర కమిటి సభ్యురాలితో పాటు మరో 6 గురు ఆరెస్టు కావడంతో పోలీసుయంత్రాంగం ఉలిక్కిపడింది.