మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ఎన్నికల పరాజయం, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి మంత్రులు అభిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 21న తుది నివేదికను ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సమర్పించనుంది.