మిషన్‌ కాకతీయతో అద్భుత ఫలితాలు

– రైతుల భాగస్వామ్యంతోనే పనులు వేగంగా చేయగలిగాం
– పూడికతీతతో చెరువుల్లో జలకళ సంతరించుకుంది
– ఈఏడాది ఐదులక్షల్లో సాగువిస్తీర్ణం పెరిగింది
– మూడ విడతల్లో 20కోట్ల క్యూబిక్‌ విూటర్ల మట్టిని తీశాం
– ఎండిపోయిన బోరుబావుల్లో 17శాతం నీటి లభ్యత పెరిగింది
– అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణెళి లక్ష్యంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్‌ కాకతీయపై కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పూడికతీతలో నాణ్యత కొరవడిందని అన్నారు. మూడు దశల్లో మంజూరి మొత్తం 7,357.04 ఇంత వరకు చేసిన వ్యయం పనులు జరగగా..  కేవలం 250వేల కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. పలు ప్రాంతాల్లో కేవలం నామమాత్రంగానే చెరువుల పూడికతీత చేపట్టి డబ్బులు డ్రాచేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ గతంలో 46వేల చెరువుల కింద 20లక్షల ఆయకట్టు ఉండేదన్నారు.. ఇప్పుడెంతుందో చెప్పాలని కోరారు.. చెరువుల్లో పూడిక తీత మంచిదే అయినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన హరీష్‌రావు మాట్లాడుతూ ఈ పథకం వల్ల చెరువులకు జలకళ రావడమే కాకుండా.. పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. చెరువులు పునరుజ్జీవం పొందాయన్నారు. మిషన్‌ కాకతీయతో సత్ఫలితాలు వచ్చాయని నాబార్డు రిపోర్టు ఇచ్చిందన్నారు. మిషన్‌ కాకతీయ కింద చెరువుల్లో తీసిన 7 కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకున్నారని తెలిపారు. 20 కోట్ల క్యూబిక్‌ విూటర్ల మట్టిని తీశామన్నారు. చెరువులను పునరుద్ధరించిన తర్వాత 2016 సంవత్సరంలో 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 2013-14లో భూగర్భ జలాలు 6.91 విూటర్లు ఉంటే 2016-17 ఏడాదిలో 9.2 విూటర్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అదనపు వరద నీటి వల్ల పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు. 2013-14 ఏడాదితో పోల్చితే 2016-17 ఏడాదిలో 36 నుంచి 39 శాతం చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. దీని వల్ల మత్స్యకారులకు మేలు జరిగిందన్నారు. ఎండిపోయిన బోరు బావుల్లో 17శాతం నీటి లభ్యత పెరిగిందన్నారు. చెరువుల కింద 24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. అయితే 2013-14 ఏడాదిలో 10 లక్షల 71వేల ఎకరాల ఆయకట్టు పండితే.. 2016-17 ఏడాదిలో 15 లక్షల 99 వేల ఎకరాల ఆయకట్టు పండించడం జరిగిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల ఏకంగా 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువగా పండించడం జరిగిందని తెలిపారు. పూడికమట్టి వల్ల పంటల దిగుబడి పెరిగిందన్నారు. ఎరువులు, రసాయనిక ఎరువుల భారం కూడా తగ్గిందన్నారు. అత్యంత పారదర్శకంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మంత్రి హరీష్‌రావు ఉద్ఘాటించారు.
కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తాం – హరీష్‌రావు
కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. 5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ.. కేవలం 4 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. మిగతా 3 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీ అని చెప్పారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే రైతులు నాలుగైదు సంవత్సరాలు పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. అందుకే కడెం ప్రాజెక్టుకు అనుబంధంగా 5 టీఎంసీల సామర్థ్యంతో కుప్తి ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 68 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇస్తామని ప్రకటించారు. అతి తక్కువ ముంపుతో కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కుప్తి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ మధ్యలోనే ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.