ముగిసిన రాష్ట్రమంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ముగిసిింది. ఈ సమావేశంలో నూతన భూకేటాయింపు విధానాన్ని ముఖ్యమంత్రి సహమంత్రి వర్గం వ్యతిరేకించింది. కొత్త భూకేటాయింపు విధానంలో స్పష్టత లేదని సీఎం అన్నారు. ప్రత్యేక మంత్రి వర్గ సమావేశం ద్వారా నూతన భూకేటాయింపు విధానాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. లక్ష్మీంపేట ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని మంత్రి కొండ్రు మురళీ డిమండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు.