ముస్లింలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముస్లిం మతపెద్దలు, మేధావులతో సమావేశమయ్యారు. పార్టీలో వారి భాగస్వామ్యం పెంచేందుకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చలు జరిపారు. రాజకీయల్లో ముస్లింలకు రిజర్వేషన్లు, వక్ఫ్‌భూముల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయబద్ధమైన వాటా దక్కేలా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ముస్లిం పెద్దలు బాబుకు సూచించారు.