మూడు వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం
గుంటూరు: సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద మూడు వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.



