మూడో విడత తనిఖీలపై ఉన్నతస్థాయి సమీక్ష : దామోదర రాజనరసింహ
హైదరాబాద్ : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీలపై బీ క్యాటగిరీ సీట్ల భర్తీ అంశాలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడో విడత తనిఖీలు ఎప్పుడు చట్టాలనే అంశంపై వచ్చే వారం ఖరారు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు తొలివిడత కింద 47 కళాశాలల్లో తనిఖీలు పూర్తిచేయగా, రెండో విడత కింద 124 కళాశాలల్లో ఉల్లంఘించిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడో దఫా తనిఖీలను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు.