మూఢనమ్మకాలు తొలగించేందుకు కృషి చేయాలి

శ్రీకాకుళం, ఆగస్టు 3: నవసమాజ నిర్మాణం పాఠశాలల నుంచి ప్రారంభమవుతుందని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జనవిజ్ఞానవేదిక జిల్లా విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాఆయన మాట్లాడుతూ పిల్లల్లో సైన్స్‌పై ఆసక్తి కలిగించడానికి, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జనవిజ్ఞానవేదిక ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబరు 14న జిల్లా స్థాయి పిల్లల కథల పోటీలు నిర్వహిస్తున్నాట్లు చెప్పారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు జి.రామారావు, పి.కూర్మారావు, కందుల జోగారావు తదితరులు పాల్గొన్నారు.