మూత పడిన ప్రభుత్వ పాఠశాల తెరిపించిన గ్రామస్తులు

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకే పంపుతామని తీర్మానం చేసి ఊళ్లోకి వచ్చిన ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలను వెనక్కి పంపేశారు. మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తెరిపించారు. ఎంఈవో సహయంతో డెప్యూటేషన్‌ మీద ఉపాధ్యాయులను  కూడా   ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు, బస్సు చార్జీలు, కలిసి తడిసి మెపేడవుతుందని అదే డబ్బుతో అవసరమైతే ఇంకా ఉపాధ్యాయులను కూడా తామే పెట్టుకొని అయినా  ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివిస్తామని వారు తెలిపారు.