మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్

తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 10 (జనంసాక్షి):
మండల కేంద్రానికి చెందిన మునగాల కాశమ్మ అనారోగ్యంతో మంగళవారం ఉదయం మరణించడంతో విషయము తెలుసుకున్న బి.ఆర్.ఎస్ నాయకులు పగడాల సైదులు యాదవ్ , ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియ చేశాడు. ఈ సందర్భంగా వారి కుటంబసభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు. గ్రామంలో ఏ విధమైన కార్యంలోనైనా తన వంతుగా సహాయం చేస్తూ ఆ కుటుంబాలకు నేనున్నాను అని భరోసా కల్పిస్తున్నందుకు , తిరుమలగిరి గ్రామ ప్రజలు ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట హమాలి బృందం కొచ్చర్ల చిన్న కోటేషు, దేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిడిగం వెంకన్న ,పిడిగం అంజయ్య, చన్న బోయిన శీను, వల్లపు ఎల్లయ్య , ఆంగోత్ మంగ్త, ఇరిగి యాదయ్య, ఎస్కే చాంద్ భాషా, పగిడిమర్రి సైదయ్య, అనుముల సైదయ్య, సీతా నాగరాజు, అనుముల కోటయ్య, కూర వెంకటయ్య చంద్రవంక సైదులు హమాలీలు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు