మెకానిక్ షాపును ప్రారంభించిన .. రైతుబంధు జిల్లా అధ్యక్షులు

బచ్చన్నపేట మార్చి 3 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కరుణాల వేణు గోపాల్ బైక్ మెకానిక్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ మండల కేంద్రంలో బైక్ మెకానిక్ గా ఎంతో మందికి మెకానిక్ నేర్పి జీవనోపాధి కల్పించి మంచి పేరు తెచ్చుకున్న యువ నాయకుడు కారణాల వేణును అభినందిస్తున్నట్లు ఇంకా పైకి ఎదగాలని మనసారా కోరుతున్నట్లు తాను చేసే మంచి పనికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి. సహకార సంఘం చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్. వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి. కోనేటి స్వామి. ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు దూడల కనకయ్య. బి ఆర్ ఎస్ నాయకులు బోడిగం చంద్రారెడ్డి. వేముల విద్యాసాగర్ గౌడ్. వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి. గంధ మల్ల నరేందర్. జంగిడి సిద్ధులు. మామిడి ఐలయ్య. ఫెరోజ్. గూడ సిద్ధారెడ్డి. కృష్ణంరాజు. జిల్లా బుచ్చయ్య. మీసా శ్రీనివాస్. హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు