మెదక్‌ జిల్లా కోర్టుకు హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌, జేఏసీలను దూషించిన కేసులో హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ మెదక్‌ జిల్లా కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. పటాన్‌చెరువు మండలం ముత్తంగిలో 2005 ఏప్రీల్‌ 16న మసీదు ఆవారా గోడ విషయంపై అప్పటి కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేసీ భీమానాయక్‌లను అసదుద్దీన్‌ దూషించడంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.