మెస్‌చార్జిలు పెంచాలి

ఖమ్మం, జూలై 10: సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నెలకు 1200 రూపాయల మెస్‌చార్జీలు పెంచాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య పాలేరు డివిజన్‌ కార్యదర్శి మన్మదరావు అన్నారు. ప్రభుత్వం వెంటనే సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలని లేనిపక్షంలో ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నెలకు హాస్టల్‌ విద్యార్థులకు 440 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, దీంతో నాణ్యమైన భోజనం అందడం లేదని, ధరలకు అనుగుణంగా నెలకు 1200 రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ విద్యార్థులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తుందని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.