మేఘాలయలో స్వల్ప భూకంపం

షిల్లాంగ్‌: మేఘాలయలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ 4.2గా నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.