మేయర్‌ ఛాంబర్‌ ముట్టడి

హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీ అలసత్వాన్ని నిరసిస్తూ ఈరోజు తేదేపా కార్పొరేటర్లు మేయర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కొంత సేపటికి మేయర్‌ వారిని లోపలికి అనుమతించి మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.