యంత్రసాయంతో మంత్రి వరినాట్లు

హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): రాజేంద్ర నగర్‌ లోని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరినాటు యంత్రాలను మంత్రి పరిశీలించారు. ట్రాన్స్‌ప్లాంటర్‌ సాయంతో వరినాట్లు వేశారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.