యానాంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి
యానాం : పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ఆదివారం యానాంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రూ. 2.90కోట్లతో నిర్మించిన చేపల బజార్‌తో పాటు రూ.89 లక్షలతో నిర్మించిన ఫిష్ డ్రైయింగ్ ప్లాట్‌ఫాంను ఆయన ప్రారంభించారు. సర్వశిక్షాభియాన్ నిధులతో గిరియం పేట హైస్కూల్‌ల్లో నిర్మించిన ఐదు తరగతి గదులను ప్రారంభించారు. యానాం వృద్ధాశ్రమం సందర్శంచి, వైబ్‌సైట్‌ను అవిష్కరించారు. అనంతరం మీసాల వెంకన్న ఆలయాన్ని, గణపతి ఆలయాన్ని సందర్శంచి పూజలు నిర్వహించారు.