యువరాజ్‌ సింగ్‌ కోలుకోవడం చాలా సంతోషం: రాజీవ్‌

క్యాన్సర్‌బారిన పడిన మిడిల్‌ఆర్డర్‌బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌సింగ్‌ తిరిగికోలుకోవడం చాలా సంతోషకర మైన విషయమని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌రాజివ్‌శుక్ల అభిప్రాయపడ్డారు.దీనిపైఆయన మాట్లాడు తూ శ్రీలంక కేంద్రంగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ ట్వంటీ కప్‌కు యవరాజ్‌ సింగ్‌ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.యూవీఆరోగ్యంపై ఆయనమాట్లాడుతూ యువరాజ్‌సింగ్‌ త్వరగా కోలుకుంటుండటం పట్ల చాలాసంతోషంగాఉంది.గతనెలరోజులుగా జాతీయ క్రికెట్‌ అకాడెమీలో తీవ్రం గా శ్రమిస్తూ ప్రాక్టీస్‌చేస్తున్నారు.ప్రాక్టీస్‌ చేస్తున్న ఫిజియో ట్రైనీలు యువరాజ్‌ సింగ్‌ను చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారని శుక్లా చెప్పాడు.