భారత్`ఈయూ ట్రేడ్ డీల్ పచ్చజెండా
` ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం
` ప్రధాని మోదీ ప్రకటన
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. “నిన్న భారత్`ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా చర్చించుకుంటున్నారు” అని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా ఎనర్జీ వీక్` 2026ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. “ఈ ఒప్పందంతో భారత్, ఐరోపా ప్రజలకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ప్రపంచంలోనే పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య సమన్వయానికి నిదర్శనం. ప్రపంచ జీడీపీలో ఇండియా, ఈయూ ఉమ్మడి వాటా 25శాతం. ప్రపంచవాణిజ్యంలో ఇది మూడోవంతుకు సమానం. ఈ డీల్ ఇరువర్గాల మధ్య వాణిజ్యాన్ని పెంపొదించడమేగాకుండా.. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలనపై మన నిబద్ధతను బలోపేతం చేస్తుంది” అని మోదీ వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ సమావేశమయ్యారు. వారు ఇండియా`ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు గోవాకు వచ్చారు. “విÖరంతా ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు భారత్‌కు వచ్చారు. మా వద్ద భారీ రిఫైనింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విషయంలో మేం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. త్వరలో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంటాం” అని వెల్లడించారు.
మోదీ చొరవతోనే సాధ్యమైంది
` చరిత్రాత్మక ఒప్పందంపై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఈయూ మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మంగళవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సంయుక్త విÖడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోస్టా మాట్లాడుతూ..“ఐరోపా, భారత్ బంధం ఈనాటిది కాదు. ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు. ఇది కుదిరేందుకు ప్రధాని మోదీ ఎంతో చొరవ తీసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు చేరుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలకు ఇది ఎంతో కీలకం. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివద్ధి చెందుతోంది” అని కొనియాడారు. ఉర్సులా మాట్లాడుతూ.. “పీఎం మోదీ.. మన ఒప్పందం కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సాధ్యమైంది. ఇండియా`ఈయూ చరిత్ర సష్టించాయి” అని పేర్కొన్నారు.
నా తండ్రి గోవాలోనే జన్మించారు: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు
తన పూర్వీకులు గోవాకు చెందినవారేనని ఈ సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వెల్లడించారు. ఆయన తండ్రి గోవాలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో పోర్చుగల్‌కు తిరిగి వెళ్లారు. గోవా పోర్చుగీస్ కాలనీగా ఉండేది. అనంతరం భారత్‌లో విలీనమైంది. ఆ తర్వాత కోస్టా తండ్రి పోర్చుగల్‌కు వలస వెళ్లారు. చిన్నప్పుడు కోస్టాను బాబుష్ అని ముద్దుగా పిలిచేవారు. ఇది కొంకణి (గోవా అధికారిక భాష) నిక్‌నేమ్. “నేను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిని. అలాగే నేను ఓవర్సీస్ ఇండియన్ సిటిజెన్‌ను కూడా. ఐరోపా`ఇండియా సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి” అంటూ తన ఓసీఐ (Oఅఎ) కార్డు తీసి చూపించారు. 1961లో పోర్చుగీస్ రాజధాని లిస్బన్‌లో జన్మించిన ఆయన.. టీనేజ్‌లో ఉన్నప్పుడు తొలిసారి గోవాకు వచ్చారు. 2015 నుంచి 2024 వరకు పోర్చుగీస్ ప్రధానిగా ఉన్న ఆయన.. 2017లో మరోమారు గోవాకు వచ్చారు. “నా తండ్రి లిస్బన్‌కు వెళ్లినా.. తన స్వరాష్టాన్ని మాత్రం వదల్లేదు. ఆయన రచనల్లో అది ఎప్పుడూ భాగమే” అని ఆ సందర్భంగా వెల్లడించారు.
మేము సూపర్‌పవర్‌గా మారాలంటే భారత్‌తో వ్యాపారం చేయాల్సిందే
` కెనడా మంత్రి
ఒట్టావా(జనంసాక్షి):వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్`కెనడా అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ఇంధన మంత్రి టిమ్ హడ్గ్‌సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్‌లలో ఒకటిగా భారత్ అభివద్ధి చెందుతోందన్నారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్‌తో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఎనర్జీ ట్రేడ్‌ను మరింత ముందుకుతీసుకువెళ్లడానికి కషి చేస్తున్నామన్నారు. చమురు, గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడానికి ఒట్టావా నుంచి భారత్‌కు ముడి చమురు, పెట్రోలియం, సహజ వాయువులను రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టిమ్ హడ్గ్‌సన్ పేర్కొన్నారు. కెనడా మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (ఊజీతీటవవజూ ఖబీతీతి) మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య (అజీనిజీటజీ`ఎనిటతిజీ) పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతోన్నట్లు తెలిపారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ నిల్వ, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో కత్రిమ మేధస్సు వాడకం వంటి విషయాలపై దష్టిపెట్టామన్నారు. 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో మన వాటా 30 నుంచి 35 శాతం పెరుగుతుందని.. భారత్ మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్‌గా నిలుస్తుందన్నారు. ఇదీ చదవండి: ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికాలో అసంతప్తి


