పురపోరుకు మోగిన నగారా
` మోగిన తెలంగాణ మున్సిపల్ నగారా
` ఫిబ్రవరి 11న పోలింగ్…12 అవసరమైతే రీపోలింగ్
` ఫిబ్రవరి 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితం వెల్లడి
` 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక
` నేటినుంచే నామినేషన్ల స్వీకరణ..30 వరకు గడువు
` 31న నామినేషన్ల పరిశీలన…ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ
` వెంటనే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
` షెడ్యూల్ ప్రకటించిన కమిషనర్ రాణి కుముదిని
` ఓటు హక్కు వినియోగించుకోనున్న 53 లక్షల మందికి పైగా ఓటర్లు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఫిబ్రవరి 11న పోలింగం నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట్ల 12న జరుపుతారు. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, నేటినుంచే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ ఎన్నికల పక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎసఈసీ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ మేరకు 28 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం అవుఉతంది. 30తో నామినేషన్ల స్వీకరణ గడవు ముగియనున్నది. 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన వారి జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగ,ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు.



