మహాఘట్టానికి వేళాయె


` నేటినుంచే మేడారం జాతర
` పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం ప్రారంభం
` భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం
` జాతర కోసం మీడియా ఉత్సాహం
` దేశవిదేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు, విలేకర్లు రాక
` జాతరలో కీలకంగా వైద్య సేవలు
` 50పడకల అస్పత్రితో ఏర్పాటు
` ప్రత్యేకంగా 30 హెల్త్ క్యాంపులు
ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం సమ్మక్క`సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జాతర సాగనుంది. అమ్మవార్లను గద్దెలకు తీసుకుని రావడం మొదలు..మళలఈ అడవికి తరలించే వరకు జాతర సాగుతుంది. ఈ మహా ఘట్టాన్ని సమర్థంగా.. భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సన్నద్ధమయ్యాయి. ఈసారి సౌకర్యాల కల్పనతోపాటు నిర్మాణ పనులనూ ఏకకాలం చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఒకవైపు వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులు సాగుతున్న సమయంలోనే లక్షలాది మంది ముందస్తుగా అమ్మలను దర్శించుకున్నారు. ప్రధాన జాతర తేదీల్లో భక్తుల రద్దీ కారణంగా గద్దెల ప్రాంగణం వద్ద అమ్మల దర్శనం ఆషామాషీ విషయం కాదు. ఈసారి గ్దదెల పునర్నిర్మాణం నేపథ్యంలో ప్రాకారం విస్తరించారు. రూ.100 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఈసారి జాతరకే వన్నె తీసుకొచ్చాయి. విస్తరణ నేపథ్యంలో ఏకకాలంలో 9`10 వేల మంది దర్శించుకొనే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. వనదేవతలు సమ్మక్క`సారలమ్మ మహాజాతర ఒక ఘట్టం మంగళవారం ప్రారంభం కానున్నది. ఊరట్టం పంచాయతీ కన్నెపల్లి గ్రామం నుంచి పోలెబోయిన వంశీయులు మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దెపై రాత్రి 7 గంటలకు జంపన్నను తీసుకురానున్నారు. జంపన్నను ఆదివాసీల్లోని నాలుగో గొట్టుకు చెందిన పోలెబోయిన వంశీయులు దశాబ్దాలుగా కొలుస్తున్నారు. గతంలో ఇంటివద్దనే పూజలు చేసుకునేవారు. 2022 నుంచి జంపన్నను గద్దెకు తీసుకువస్తున్నారు. గతంలో జంపన్నను తీసుకువచ్చిన పోలెబోయిన సత్యం గతేడాది అనారోగ్యంతో మరణించడంతో ఈసారి అతడి సోదరుడు శ్రీను ఆ బాధ్యతలు తీసుకున్నారు. మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పెనుక వంశీయుల ఇలవేల్పు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును మేడారానికి తీసుకెళ్తారు. మహాజాతర పగిడిద్దరాజు చేరికతో ప్రారంభమవుతుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే గ్రామంలో పెనుక వంశీయులు పగిడిద్దరాజు ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గ్రామంలోని పెనుక వెంటేశ్వర్లు ఇంట్లో పగిడిద్దరాజుకు ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి పాన్పును ఊరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తీసుకెళ్తారు. అనంతరం పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి ఊరేగింపుగా మేడారానికి బయల్దేరుతారు. అటవీ మార్గంలో కాలినడకన వెళ్తూ మంగళవారం రాత్రి లక్క్ష్మీపురంలో బస చేస్తారు. బుధవారం ఉదయం మళ్లీ మొదలై మధ్యాహ్నం వరకు మేడారం చేరుకుంటారు. గ్దదెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో మహాజాతర మొదటి ఘట్టం మొదలవుతుంది.
దేశవిదేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు, విలేకర్లు రాక
మేడారం జాతరలో విÖడియా మేనేజ్‌మెంట్ అనేది అత్యంత ప్రధానమైనది, కీలకమైనది, సంక్లిష్టమైనది. అయితే సాంకేతికత పెరిగిన కారణంగా విÖడియా కవరేజ్ చాలా సులువుగా మారింది. ఒక్క సెల్‌ఫోన్‌తో ప్రపంచ వ్యాప్తంగా సమాచారన్ని చేరవేసే అవకాశం రావడంతో జాతరలో ప్రత్యేకతలను విలేకరులు ఎప్పటికప్ప్పుడు తమ కార్యాలయాలకు చేరవేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రింట్, ఎలక్టానిక్ విÖడియా విలేకర్లు పోటీపడి జాతరను కవర్ చేయడం చూస్తున్నాం. ఈ జాతర జరిగే నాలుగు ర ఓజులే కాకుండా నెల ముందునుంచి తరవాత ఓ పక్షం రోజుల వరకు నిరంతరం ప్రతి సూక్క్ష్మ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తుంటారు. ఈ జాతర కవరేజీకి డీపీఆర్వో కార్యాలయం నుంచే దాదాపు వెయ్యి విÖడియా పాస్‌లు జారీచేయడం, దానికితోడు మరో రెండు వందలకు పైగా దేశ, విదేశీ జర్నలిస్టులు కవరేజీ చేసేందుకు చేస్తారు. జాతరపై అధ్యయనం చేసేందుకు, జాతర అంశాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు కూడా వస్తారు. గిరిజన సంస్కతీ, సాంప్రదాయాలు, మొక్కులు, జాతర జరిగే తీరు, వివిధ రాష్టాల నుంచి వచ్చే గిరిజన జాతుల సంస్కతీ సంప్రదాయాలను తమ కథనాలతో పాటు, ఫోటోల ద్వారా అందించేందుకు ఉత్సాహం చూపుతారు.
మేడరాం జాతరలో కీలకంగా వైద్య సేవలు
మేడారం జాతరలో వైద్యశాఖ సేవలు కీలకంగా మారాయి.ఈసారి 50పడకల అస్పత్రితో పాటు ప్రత్యేకంగా 30 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 5,192మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. జాతర సమయంలో 24గంటలు సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ విస్తత ఏర్పాట్లు చేసింది. 649మంది వైద్యాధికారులు, 154మంది ఆయుష్ వైద్యాధికారులు, 673మంది నర్సింగ్ అధికారులు, 1,905మంది ఆశ వర్కర్లు, 1,111మంది పారా మెడికల్ సిబ్బంది, 331మంది సూపర్‌వైజరిస్టాఫ్, 700మం ది ఇతర సిబ్బదిని నియమించారు. జాతర అనంతరం కూ డా వ్యాధులు ప్రబలకుండా 10మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు ములు గు జిల్లా అస్పత్రి, ఏటూరునాగారం ఏరియా అస్పత్రిల్లో వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 108 వాహనాలను 15 అందుబాటులో ఉంచుతున్నారు. మరో 15 మొబై ల్ అంబులెన్స్‌లను కూడా జాతరకు తరలిస్తున్నారు.

తెలంగాణా కుంభమేళాను వైభవంగా జరుపుకోవాలి
` రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిందని అన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్టాభివద్ధికి పునరంకితమవుతామని అన్నారు. నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్టాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు.