సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి
` గవర్నర్ జోక్యం చేసుకోవాలి
` సంస్థలో కుంభకోణాన్ని అడ్డుకోవాలి..
` గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): సింగరేణిలో బొగ్గు స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రసమితి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్ట నేతలు లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆరఆర్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విÖడియాతో మాట్లాడారు. “సింగరేణిలో దోపిడీ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చాం. ఆధారాలతో బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో వణుకు మొదలైంది. కుంభకోణాన్ని బట్టబయలు చేశాక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతు న్నాయి. ప్రజల దష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. సీఎం అంటే కోల్ మాఫియా నాయకుడిగా సింగరేణి కార్మికులు భావిస్తున్నారు. ఫుట్‌బాల్ ఆటకు రూ.10కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారు. స్కామ్‌ల విషయంలో పాలకుల నుంచి స్పష్టమైన జవాబు లేదు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో పారదర్శకతకు పాతరేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి టెండర్లలో నిబంధనలు పెట్టారు. నిబంధన పెట్టిన 9 నెలల్లో ఎందరు కాంట్రాక్టర్లు సందర్శించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రింగ్ మాస్టర్ సజన్రెడ్డి.. సీఎం బావమరిదేనా? కాదా? స్పష్టత ఇవ్వాలి. కాంట్రాక్టర్లను రింగ్ చేసి ప్రజాధనం దోపిడీకి యత్నిస్తున్నారు. ప్రభుత్వం రూ.వేల కోట్లు కొల్లగొడుతోందని సింగరేణి కార్మికులు గుర్తించాలి. సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవాలని గర్నవర్‌ను కోరాం” అని కేటీఆర్ తెలిపారు.
సోలార్ పవర్ స్కాంపై కేటీఆర్
సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని.. తాము సోలాం పవర్ స్కాం గురించి కూడా బయటపెట్టామని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆరఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ విÖడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో నేడు సోలార్‌లో నిర్మాణం జరుగుతుంది. కానీ తెలంగాణలో సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ.7 కోట్లట.. దేశం మొత్తంలో 2, 3 కోట్లలో అయ్యేది ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు అవుతుంది.. ఇది సోలార్ పవర్‌లో స్కాం కాదా అని మేం నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదని ప్రశ్నించారు. అలాగే గనుల్లో వాడే పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ 30 శాతం అదనంగా రేటు పెంచారు.. ఎందుకు పెంచారని అడిగితే సమాధానం లేదన్నారు.చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి, డైరెక్టర్ వీకే శ్రీనివాస్.. ఈ ఇద్దరూ కూడా ఈ 30 శాతం అదనంగా ఎందుకు పెడుతున్నారు. ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. జిలెటిన్ స్టిల్స్, పేలుడు పదార్థాల విÖద 30 శాతం ఎందుకు పెంచారని డైరెక్టర్లు బోర్డులో నిలదీస్తే వాళ్ల విÖద చర్యలు తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లను లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేదు.. ఇది వాస్తవమా..? అని మేం నిలదీస్తే సమాధానం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దష్టికి సవివరంగా తెచ్చాం. బెదిరించి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ప్రజాధనాన్ని.. ప్రజాధనం ఎందుకంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థలో 51 శాతం ఓనర్‌షిప్ తెలంగాణ ప్రభుత్వానిది.. 49 శాతం ఓనర్‌షిప్ కేంద్రప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలది అన్నప్పడు ఈ సొమ్ము మొత్తం ప్రజలదే.. సింగరేణి కార్మికులదేనన్నారు.
బావమరిదికి సింగరేణిని గుత్తకు రాసిచ్చిండు..
ఈ కోల్‌బెల్ట్‌లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో.. దీనిపై మేం ఎన్నిసార్లు అడిగినా సమాధానం రావడం లేదన్నారు. వాస్తవేమేంటంటే అన్నదమ్ముళ్లు దోచుకున్నది రేవంత్‌రెడ్డికి సరిపోవడం లేదట. హిల్ట్ కుంభకోణం పేరు విÖదు హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9200 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటకు తీసుకొచ్చింది. అన్నదమ్ముళ్ల దోపిడీని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డికి అన్నదమ్ముళ్ల దోపిడి సరిపోవడం లేదట. ఇప్పుడు బావమరిది కండ్లలో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండని కేటీఆర్ ఆరోపించారు.ఏ బొగ్గుగనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం రాదన్నారు. నిజంగనే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం సిఫారసు చేసి ఉంటే.. ఆ రోజున్న బీఆరఎస్ ప్రభుత్వం తరపున అన్ని టెండర్లను కూడా మేం పారదర్శకంగా పిలిచినం. అందుకే ఆ రోజు అన్నీ మైనస్ టెండర్లు వచ్చినయ్. ఎస్టిమేటివ్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా.. కాదా..? అని ప్రశ్నించారు. మరి ఆ రోజు టెండర్లలో లేని షరతు విÖ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు?? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్ .2025`26లో నిజానికి జనవరిలో ఈ నిబంధనలు లేకుండా ఒక టెండరు చేశారు. జనవరిలో టెండరు వేస్తారు.. మళ్లీ వెంటనే ఆ టెండరు రద్దు చేశారు. టెండర్లలో ఈ నిబంధన లేకుండా ఆ రోజు విÖరు టెండరు పిలిస్తే మైనస్ `7 శాతానికే పనిచేస్తామని (అంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పనిచేస్తామని) కాంట్రాక్టు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ విÖరు దాన్ని రద్దు చేశారు. ఈ నిబంధన పెట్టారు. దాని వల్ల తిరిగి మళ్లీ అదే ప్లేస్‌లో టెండర్ పిలిస్తే G12 (అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలు) కావాలని చెప్పి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా.. కాదా అని చెప్పాలని ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.
కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే..
విÖరు నిబంధన పెట్టిన మే 25 నుంచి ఈ రోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఎంతమంది కాంట్రాక్టర్లు స్థలాన్ని (సైట్‌ను) సందర్శించారని కేటీఆర్ కేటీఆర్ . విÖకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినయి. ఎన్ని లేఖలొచ్చాయి. సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని విÖరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకిచ్చారు విÖరు. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే విÖరు ఎందుకు ఎంచుకుంటున్నారు. మిగతావాళ్లనెందుకు పక్కనపెడుతున్నారు. ఇందులో రింగ్ మాస్టర్ సజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా..కాదా అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టం లేదని చెప్పారు కేటీఆర్.ఒక్క నైనీ బొగ్గు గని టెండర్లే కాదు.. నైనీలో కూడా 2021, 2022లో రెండుసర్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు బీఆరఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమొచ్చింది. అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు.



