ఎంపీ సంతోష్‌పై సిట్ ప్రశ్నల వర్షం

` ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆరఎస్ ఎంపీని సుదీర్ఘంగా విచారించిన అధికారులు
హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు హైదరాబాద్ లోని సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇదే కేసులో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఇప్పటికే సిట్ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి రెండేళ్ల క్రితం హైదరాబాద్?లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్) ఏర్పాటు చేయడం, పలువురు పోలీసు అధికారుల అరెస్టుల విషయాలు తెలిసిందే. అప్పట్లో అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎసఐబీ) ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు గత జూన్‌లో స్వదేశానికి తిరిగి వచ్చాక దర్యాప్తు వేగంగా జరుగుతోంది.రాబోయే రోజుల్లో మలుపు తిరుగుతుందా? : ప్రభుత్వం ఇటీవల సిట్ బాధ్యతలను హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు అప్పగించింది. తాజాగా మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణ చేశారు. అవసరమైతే మరోమారు విచారణ చేయాల్సి ఉంటుందని వీరికి స్పష్టం చేసింది. ఇప్పుడు మాజీ ఎంపీ కేసీఆర్ బంధువు సంతోష్‌రావును పిలవడంతో రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం : ఎసఐబీ ఐజీగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును అప్పటి ప్రభుత్వం కొంతకాలం ఇంటెలిజెన్స్ చీఫ్?గా నియమించింది. అత్యంత కీలకమైన ఈ విభాగం బాధ్యతలు పదవీ విరమణ చేసిన అధికారికి అప్పగించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఎసఐబీ నిఘా విభాగం పరిధిలోనే పనిచేస్తుంది. ఈ రెండింటికీ ప్రభాకర్‌రావే ఇన్‌ఛార్జిగా కొంతకాలం చూసుకున్నారు. తర్వాత అనిల్‌కుమార్‌ను నిఘా విభాగాధిపతిగా నియమించినప్పటికీ ఎసఐబీ ఓఎస్డీగా ప్రభాకర్‌రావే పనిచేశారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆరఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్‌రావు తన హోదాకు రాజీనామా చేశారు. తర్వాతే ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడింది. ప్రభాకర్‌రావు నిఘా విభాగంతో పాటు ఎసఐబీలకు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బందం నిర్ధారించింది. ట్యాపింగ్ కోసమే పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభాకర్‌రావుకు నిఘా విభాగం బాధ్యతలు అప్పగించడంతో పాటు ఎసఐబీ ఓఎస్డీగా కొనసాగించారన్నది సిట్ ప్రధాన అభియోగం.ఈ బాధ్యతలు ప్రభాకర్‌రావుకు అప్పగించాలన్న నిర్ణయం ఎవరిదని? ఆదేశాలు ఎవరిచ్చారన్నది తెలుసుకోవాలని సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని విచారణ చేసినప్పుడు కూడా సిట్ అధికారులు ప్రభాకర్‌రావు నియామకం గురించి ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంతోష్‌ను కూడా ఇదే అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం.
సంతోష్ రావుకు నోటీసులివ్వడాన్ని ఖండించిన కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్?ఎస్? కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. ఈ ఫోన్? ట్యాపింగ్ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని, అసలు బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను వరుసగా విచారణకు పిలవడం రాజకీయ కక్షసాధింపే అని మండిపడ్డారు. అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని, గతంలో హరీశ్‌రావును, తనను ఇదే కేసు పేరుతో విచారించినా ఏవిÖ సాధించలేకపోయారన్నారు. ఇప్పుడు సంతోష్ రావును లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు. ఈరోజు లోక్?భవన్?కు వెళ్లి గవర్నర్‌కు బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇచ్చారు.



