యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీల నియామకం..

ఊరుకొండ, ఆగస్టు 26 (జనం సాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి, ముచ్చర్లపల్లి ముచ్చర్లపల్లి గ్రామాలకు చెందిన శ్రీనివాస్ యాదవ్,
దార బంగారయ్య లకు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీలుగా నియామక పత్రాలు అందజేసినట్లు వారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో తాము చాకచక్యంగా వ్యవహరిస్తున్న తీరును గుర్తించి తమకు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రెటరీలుగా నియమించినందుకు, అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారి నియామకం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నియామక పత్రాలు అందజేసిన వారిలో
జిల్లా ప్రెసిడెంట్ వాసు యాదవ్, ఏఐసీసీ శిక్షణ విభాగం దార భాస్కర్,
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కుడుముల తిరుపతి రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ఎండీ.ఆరిఫ్, మాజీ సర్పంచ్ జంగయ్య, సేవాదళ్ ప్రెసిడెంట్ గణేష్, దయాకర్, తదితరులు ఉన్నారు.

తాజావార్తలు