యూపీఏకు డీఎంకే షాక్‌!

మద్దతు ఉపసంహరిస్తూ రాష్ట్రపతికి లేఖ
మైనార్టీలో సంకీర్ణ సర్కారు
బయట నుంచి మద్దతు ఇచ్చేది లేనిది చెప్పలేం
మధ్యవర్తిత్వంపై ‘కరుణ’చూపలేదు
నేడు మంత్రుల రాజీనామాలు ప్రధానికి అందజేస్తాం : టీఆర్‌. బాలు
న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) :
బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొస్తున్న యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే గట్టి షాక్‌ ఇచ్చింది. యూపీఏకు మద్దతు ఉపసంహరించు కుంట్ను ట్లు ఆ పార్టీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మంగ ళవారం లేఖ అందజేసింది. కేంద్ర మంత్రి, డీఎంకే ముఖ్యనేత టీఆర్‌ బాలు నేతృత్వంలోని నాయకులు బృందం రాష్ట్రపతిని కలిసి తమ లేఖను అందజేసింది. కేంద్రంలోనిసంకీర్ణ ప్ర భుత్వంలో రెండో అతి పెద్ద భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే యూపీఏ నుంచి వైదొలగ డంతోసంకీర్ణ సర్కారు సంక్షోభంలో చిక్కు కుంది. శ్రీలంకలో తమిళుల పట్ల అక్కడి ప్రభు త్వం సాగించిన హత్యాఖాండను భారత ప్ర భుత్వం తరఫున ఐక్యరాజ్యసమితి మానవ హ క్కుల సమితి సమావేశంలో

వ్యతిరేకించాలని, లంకుకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వాలని డీఎంకే డిమాండ్‌ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం రెండు రోజులుగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నా ఫలితం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించారు. లోక్‌సభలో డీఎంకేకు 18 మంది సభ్యుల బలముంది. యూపీఏలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఆ పార్టీ వైదొలగడంతో ప్రభుత్వ మనుగడ సంక్షోభంలో పడింది. డీఎంకే వైదొలిగిన నేపథ్యంలో యూపీఏ బలం 230కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. కేంద్ర మంత్రులు చిదంబరం, ఆకే ఆంటోని, గులాంనబీ ఆజాద్‌ జరిపిన చర్చల్లో ఎలాంటి హామీ రాకపోవడంతో కరుణానిధి మద్దతు ఉపసంహరణ నిర్ణయం తీసుకోలేదు. మధ్య వర్తిత్వంపై కరుణానిధి కరుణ చూపకపోవడంతో యూపీఏ సర్కారు మనుగడ ప్రశ్నార్థకమైంది.

ప్రస్తులం లోక్‌సభలో 539 మంది సభ్యులున్నారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 270. అయితే, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు కలిపి 230 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. కాంగ్రెస్‌కు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌జేడీ, బయటి నుంచి మద్దతిస్తున్నాయి. ఆయా పక్షాలకు 49 మంది సభ్యులు ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం బొటాబోటీగా కొనసాగినా.. మద్దిస్తున్న ఏ ఒక్క పార్టీ పక్కకు తప్పుకున్నా ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. యూపీఏ తీరుపై ఇప్పటికే మిత్రపక్షాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రధానంగా సమాజ్‌వాదీ మన్మోహన్‌ సర్కారుపై ఆగ్రహంతో రగిలిపోతోంది. అయినప్పటికీ, మద్దతు ఉపసంహరించే విషయంపై ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తోంది. 22 మంది ఎంపీలున్న ఎస్పీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే… ఉప ఎన్నికలు రావడం ఖాయం.

అయితే, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేవిూ లేదని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. లోలోపల మథనపడుతూనే… పూర్తి కాలం అధికారంలో కొనసాగుతామని చెబుతోంది. తాజా పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. యూపీఏ నుంచి వైదొలిగిన నేపథ్యంలో సర్కారు మైనార్టీలో పడిందని భావిస్తున్న ప్రతిపక్ష ఎన్డీయే.. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని యోచిస్తోంది. అవినీతి కుంభకోణాలు, ఆకాశన్నంటుతున్న ధరల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగితే తమకు లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తాజాగా ప్రకటించింది.