ఏపీ వాహనదారులు అంతర రాష్ట్ర వాహన పన్ను కట్టాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 15ను సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వాదననా కోర్టు తిరస్కరించింది. త్రైమాసిక పన్నును తనిఖీ కేంద్రాల వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లించిన పన్ను కోసం ఖాతా నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వసూలైన పన్ను మొత్తాన్ని వినియోగించొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.