రాజీవ్‌గాంధీ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి

హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు మరోమారు విచారించాలని జనతపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్‌ చేశారు. చిదంబరం, కరుణానిధి ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ దేశంనుంచి సురక్షితంగా తప్పించేందుకు సాయపడ్డారని, ఈ క్రమంలో వీరిని స్రపశ్నించాల్సిఉందని మరోవైపు చిదంబరం ఎల్‌టీటీఈకి సహాయపడ్డారన్న వదంతులున్నాయని ఇవి స్వయంగా చేశారా ఎవరి ప్రోధ్భంలంతో చేశారన్నది స్పష్టంకావాలని ఇటలి ఆయుధ వ్యాపారీ ఖత్రోచీ ఎల్‌టీటీఈకి ఆయుధాలు సరఫరా చేసేవాడని, ఖత్రోచితో సోనియాకు సంబంధాలున్నాయని రాజీవ్‌హత్యోదంతంలో సోనియాను విచారించాలని డిమాండ్‌చేశారు.