-->

రామన్నపేటలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు

రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి)
 దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్పూర్తితో విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని ఎస్.ఎఫ్.ఐ మండల అద్యక్ష,కార్యదర్శులు మేకల జలెందర్,బండ్ల పవణ్ కళ్యాణ్ అన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి సందర్బంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభను నిర్వహించి జోహార్లు అర్పించారు అనంతరం మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ యువతలో చైతన్యం రగిలించేందుకు ప్రాణాలను తృణప్రాయం చేసిన వీరయోదుడు భగత్ సింగ్ అన్నారు. అందరికీ సమాన విద్యావకాశాలు,ఉపాధి కోసం భగత్ సింగ్  స్పూర్తితో ఉద్యమించాలన్నారు. ప్రభుత్వాలు అవలంభించే విద్యా,వ్యతిరేక విధానాలపై విద్యార్థులు చైతన్యంతో సమరశీల ఉద్యమాలు నిర్వహించాలన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే భగత్  సింగ్ కు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ,మధు భాబు,గుండాల నరేష్,అప్పం పల్లవి,సిందూ,స్వప్న,ఇటుకాల ఉదయ్,రాజు తదితరులు పాల్గొన్నారు.