రామాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం.

 

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలోని రామాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు దిప్లా నాయక్ తెలిపారు.ఈ సందర్బంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులు అధికారులుగా,
జిల్లా కలెక్టర్ గా దీక్షిత్,జిల్లా విద్యా శాఖ అధికారిగా,వేణు. ప్రధానోపాధ్యాయులుగా యామిని, ఉపాధ్యాయులుగా,త్రివేణి,సౌమ్య,నందిత,వ్యాయామ ఉపాధ్యాయుడిగా,తరుణ్ తమ పాత్రలలో అలరించారు.ఉత్తమ ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధురి, అంగన్వాడి టీచర్ ప్రీతి, ఆయా అగ్నిషమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.