రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తాం: బైరెడ్డి
కర్నూలు: రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని కొత్త పార్టీ ఏర్పాటు, మరో పార్టీలో చేరడం వంటి అంశాలకు అవకాశమే లేదని తెదేపా మాజీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఆత్మగౌదరవ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కేతవరంలో ప్రారంభమైంది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 40 రోజుల పాటు వెయ్యి కి.మీ. మేర ఈ పాదయాత్ర సాగనుంది.



