రాష్ట్రంలో ఏటా 45వేల రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏడాది దాదాపు 45 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రమాదాల్లో 15 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఒక బీమా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో రోడ్డు భద్రతపై పూర్తి అవగాహనను పెంపొందించాల్సిన బాధ్యత అందరిపైనా  వుందన్నారు.