రాష్ట్రంలో పంటలసాగుపై నివేదిక సమర్పించాలి

హైదరాబాద్‌: నీటిమట్టం నాగార్జునసాగర్‌లో 510, శ్రీశైలంలో 839 అడుగులకు చేరినా నీటిని విడుదల చేయటం లేదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీన్ని విచారించేందుకు రాష్ట్రంలోని పంటలసాగుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల10కి వాయిదా వేసింది.