రాష్ట్రం విడిపోతే రాయలసీమ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి

హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోతే రాయలసీమ పరిస్థితి ఏమిటన్న విషయంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితా ఆధ్వక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు తమ ప్రాంత ప్రటల మనోభావాలను కూడా అర్ధం చేసుకుని ప్రత్యేక రాయలసీమ అంశాన్ని కూడా ఆ లేఖలో పొంఉపర్చాలని కోరారు. భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రం విడిపోతే తాము ఎవరి వెంట వెళ్లాలని ప్రశ్నించిన ఆయన సీమ ప్రజలను పక్కదారి పట్టించవద్దని కోరారు.