రాష్ట్రానికి అదనపు రుణం
– అర్హతసాధించిన తెలంగాణ
దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి): అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతించింది. సులభతర వాణిజ్యం, ఒకే దేశం-ఒకే రేషన్, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు ఈ అవకాశం కల్పించింది. ఏపీకి రూ.2,525కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.