రాష్ట్ర పండుగగా బోనాల జతర: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగానే జరుగుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల జాతరకు వచ్చిన ఆయన. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో వైభవోపేతంగా జరిగే సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినట్లే అతి త్వరలో బోనాల జాతరపై అధికారిక ప్రకటన చేస్తామని మంతి హమీ ఇచ్చారు.