రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5.99శాతం కరువు భత్యం పెంపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 1, 2012నుంచి ఈ పెంపు అమలులో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా రూ. 1480కోట్ల భారం పడనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకొంది. వివిధ శాఖాల్లో ఖాళీగా ఉన్న 758పోస్టుల భర్తీకి మంత్రివర్గం అంగీకరించింది. 549ఉపాధ్యాయులు, 35మంది వైద్యులతో పాటు ఇతర శాఖల్లో 174పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.