రాష్ట్ర హజ్‌ కమిటీకి అదనపు కోటా మంజూరు

హాఫిజ్‌ బాబానగర్‌, న్యూస్‌టుడే :

ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ అధ్యక్షులు సయ్యాద్‌ఖలీద్‌ ఉద్దీన్‌ అహ్మద్‌ అన్నారు. మంజూరైన అదనపు సీట్లను నిరీక్షణ జాబితాలొ ఉన్న అభ్యర్ధులకు కేటాయిస్తామని చేప్పారు. ఇదివరకే ఎంపికైన అభ్యర్ధులు రూ.51వేలు చొప్పున జూన్‌ పదకొండులోప చెల్లించాలని, లేకుంటే వారి పేర్లను తొలగిస్తామని అన్నారు. నాంపల్లి లోని హజ్‌ కమిటీ కార్యలయం రెండో శని,ఆదివారాల్లో కూడా పని చేస్తుందని చెప్పారు.