రాహుల్‌ వచ్చినా కాంగ్రెస్‌కు అవకాశముండదు

– రేవంత్‌ చేరికతో కాంగ్రెస్‌లో కొట్లాటలు తీవ్రరూపం దాలుస్తాయి

– రాజీనామాలేఖను స్పీకర్‌కిచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు

– టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యాక తన రాజీనామా అప్రస్తుతం

– విూడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలంగాణాలో మరో పదేళ్లు తెరాసనే అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చి రాష్ట్రంలో తిష్టవేసినా కాంగ్రెస్‌ అవకాశం ఉండదని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన తలసాని విూడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు కంగారు పడుతున్నారని తెలిపారు. రేవంత్‌ విషయంపై విలేకరులకు అడుగగా.. రేవంత్‌ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే రేవంత్‌ రాజీనామాపై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు చేరనేలేదని, ఏదో ఆయనే నేరుగా స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్లు బాగా ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి తలసాని విమర్శించారు. రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరికతో ఆటమొదలైంది రాష్ట్ర రాజకీయాల్లో కాదని కాంగ్రెస్‌లోనే ఆటమొదలైందన్నారు. రేవంత్‌ చేరికతో మరికొద్దిరోజుల్లో కాంగ్రెస్‌ ప్రస్తుతం ఉన్న గ్రూపు రాజకీయాలు మరింత ఉదృతమవుతాయని, తద్వారా రేవంత్‌ చేరిక కాంగ్రెస్‌ను మరింత నష్టపరుస్తుంన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంకు కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు సన్నద్ధమవుతుండటంపై విలేకరు లప్రశ్నించగా.. అసెంబ్లీలో వారు అవిశ్వాసం పెట్టినా ఒరిగేదేవిూ ఉండదన్నారు. అసలు సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాసం మాట ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిందేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇప్పటికే తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులకు ఆదేశాలిచ్చారన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతిప్రశ్నకు సమాధానమివ్వటం జరుగుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 50 రోజులు అసెంబ్లీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని, అనుకున్నట్లుగానే 50రోజులు సభ జరిపి తీరుతామన్నారు.

సందర్భంగా తన రాజీనామా లేఖపై కూడా మంత్రి తలసాని స్పందించారు. తన రాజీనామా లేఖ ప్రస్తుతం స్పీకర్‌ దగ్గరే ఉందని, టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యాక తన రాజీనామా లేఖ అప్రస్తుతమని అన్నారు.