రికార్డు వ్యాక్సినేషన్ ఒక్క రోజు ముచ్చటేనా..
` మండిపడ్డ రాహుల్
దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ‘ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం’ అంటూ మోదీ పుట్టినరోజు కోసమే ఈ రికార్డులు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కొవిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న గత పదిరోజుల వ్యాక్సినేషన్ వివరాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. రికార్డుకు ముందు, రికార్డు తర్వాత వ్యాక్సినేషన్లో వేగం తగ్గడం గ్రాఫ్‌లో కనిపిస్తోంది.అంతకుమందు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై శనివారం రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇలాంటి మరెన్నో రోజులు ఇదే తీరున వ్యాక్సినేషన్ జరగాలని, దేశానికిదే కావాలని ట్వీట్ చేశారు. రోజూ మోదీ పుట్టినరోజు కావాలని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్య బాణాలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రికార్డు వ్యాక్సినేషన్ వల్ల ఓ పార్టీకి జ్వరమొచ్చిందని వ్యాఖ్యానించారు.