రిటైర్‌ అయ్యే ఆలోచనలేదు:విశ్యనాథన్‌ ఆనంద్‌

రిటైర్‌ అయ్యే ఆలోచనలేదు:విశ్యనాథన్‌ ఆనంద్‌
చెన్నై, జూన్‌ 2 :
ఐదోసారి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించడం చాలా ఆనందంగా ఉందని చెస్‌ క్రీడారుడు విశ్వనాథ్‌ ఆనంద్‌ అన్నాడు. ఆయన ఆదివారం చెన్న య్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాతృదేశమైన భారత్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అభిమానులు ఆశీస్సులు,

విశ్యనాథన్‌ ఆనంద్‌

విశ్యనాథన్‌ ఆనంద్‌

తల్లిదండ్రులు,సతీమణి ప్రోత్సాహంతోనే తాను విశ్వవిజేతగా నిలి చినట్టు చెప్పాడు.తన విజయాన్ని కోరుకున్న ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదా లు తెలిపాడు. ప్రపంచ చెస్‌ ఛాంపీయన్‌షిప్‌లో గెలిచిన ఆనంద్‌కు తమిళనా డు ముఖ్యమంత్రి రెండు కోట్ల రూపాయలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.గత ఐదు సంవత్సరాలుగా తిరుగులేని ప్రపంచ చెస్‌ ఛాంపీయన్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్న విశ్వనాథన్‌ ఆనంద్‌ చెస్‌ని వదిలివేసే ఆలోచన లేదని అన్నాడు. ఐదవసారి ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ను సాధించడం తనకు ఎం తో ఆనందానిచ్చిందని…ఐతే బోరిస్‌ గెల్ఫాండ్‌తో జరిగిన రాపిడ్‌ టైబ్రేక్‌లో విజయం సాధించడం కాస్త (క్లిష్టమైన” చర్యగా పేర్కొన్నాడు. ఐదవసారి ప్రప ంచ ఛాంపియన్‌షిప్‌ తనకు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాడు.చెస్‌ ఆడ డం నాకు చాలా సంతృప్తినిస్తుందని.. రిటైర్‌ అవ్వడానికి నాకు ఎటువంటి రీజన్‌ కనిపించలేదని ఆదివారం తన దీర్ఘకాలిక స్పాన్సర్‌ ఎన్‌ఐఐటి నిర్వహిం చిన సన్మానోత్సవ సభలో పాత్రికేయులతో మాట్లాడారు. అంతక ముందు వర ల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్‌ అనంద్‌కు స్వదేశంలో ఘన స్వాగ తం లభించింది. ఆనంద్‌ అభిమానులు, చెస్‌ ప్రముఖులు ఆనంద్‌కు చెన్నై ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులు, చెస్‌ ఆటగాళ్ళ తో పాటు అతడి తల్లి దండ్రులు భార్య అరుణ స్వాగతం పలికారు. ప్రభుత్వం తరుపున అడిషనల్‌ సెక్రటరీ రాజ్‌కుమార్‌, క్రీడలసెక్రటరీ విజయ్‌కుమార్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ దేశానికి తానెప్పుడూ రుణపడి ఉంటానని అన్నాడు.తనవిజయాన్ని గుర్తించితమిళనాడు ముఖ్యమ ంత్రి జయలలిత రెండు కోట్లు ప్రైజ్‌ మనీగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.