రుయా ఆస్పత్రిలో పిల్లల మరణాలపై లోకాయుక్త, ఆగ్రహం

హైదరాబాద్‌: తిరుపతి రుయా ఆస్పత్రిలో పిల్లల మరణంపై లోకయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యకతంచేశాయి. ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఉప లోకాయుక్త ఎంవీఎస్‌ కృష్ణాజీరావు ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కూడా విచారణ చేపట్టింది. ఘటనపై సెప్టెంబరు 13 లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కమిషన్‌ సభ్యుడు కాకునూరి పెదపేరిరెడ్డి ఆదేశించారు.