రూ.14.85 లక్షల విలువైన వజ్రాభరణాల చోరీ
హైదరాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): ఓ నగల దుకాణ యజమాని తన కారులో ఉంచిన రూ. 14.85 లక్షల విలువైన వజ్రాభరణాలు చోరీకీ గురైన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట డీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్) సంతోశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావు నగర్‌లోని పవన్‌మోర్ నగల దుకాణం యజమాని ఈ నెల 17వ తేదీ ఉదయం తన ఇంటి నుంచి ఓ వినియోగదారునికి ఇవ్వాల్సిన రూ. 14.85 లక్షలు విలువైన డైమండ్ నె/-లకెస్, చెవి రింగులు తీసుకుని తన ¬ండా సిటి కారులో పంజాగుట్టలోని తన దుకాణానికి చేరుకున్నాడు. ఆభరణాలను కారులోనే మరిచిపోయి వ్యాలే పార్కింగ్ డ్రైవర్ వెంకటేశ్‌కు తన కారును అప్పగించి దుకాణంలోకి వెళ్లాడు. ఈ నెల 18న సంబంధిత కొనుగోలుదారు పవన్‌మోర్‌కి ఫోన్ చేసి తాము ఆర్డర్ ఇచ్చిన నె/-లకెస్‌ను తీసుకుంటామని చెప్పారు. వారి ఫోన్‌కాల్ రావటంతో యజమాని తన కారు వద్దకు వెళ్లి చూసుకోగా వజ్రాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో నగలు చోరీకి గురయ్యాయని నిర్దారించుకుని వ్యాలే డ్రైవర్లు వెంకటేశ్, అరుణ్ సింగ్, ఆఫీస్ సిబ్బంది చందన్ తదితరులపై తనకు అనుమానం ఉందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.



