రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి, జూన్‌ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి లారీలో భారీ ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న అటవీ శాఖాధికారులు వారిని అటకాయించేందుకు ప్రయత్నించారు. లారీ వేగంగా ముందుకు దూసుకుపోవడంతో అధికారులు దానిని వెంబడిస్తూ వెళ్లారు. మల్లవరం వద్ద లారీని ఆపి దానిలోని ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 50 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.