రెండు మండలాల్లో రూ.50 కోట్లతో అభివృద్ధి
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు మండలాలకు రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ట్రైమెక్స్ కంపెనీ డైరెక్టర్ విజికె మూర్తి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.10 కోట్ల చొప్పున ఈ నిధులను రెండు మండలాల అభివృద్ధి పనులకు వినియోగిస్తామన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక వరం రెసెడెన్సీలో ఆయన విలేకరుల సమావేనశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీకి స్థానిక ఈ ప్లాంటు ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతుందన్నారు. ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు లీయోన్ (దక్ష్మిణాప్రికా) మాట్లాడుతూ ట్రైమెక్స్‌్ పరిశ్రమ దక్షిణాప్రికాలోను ఉందన్నారు. లైెజన్ అధికారి ఎన్‌ఎల్‌రావు మాట్లాడుతూ పరిశ్రమలు జిల్లాకు ఉపయోగపడాలన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల పలాస, కాశీబుగ్గలో డయాలసిస్ కేంద్రంతో పాటు ఐసియు లేబరేటరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ.2.50 కోట్లతో ఈ పనులు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధి బగాయి. కంపెనీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.